Bheemgal ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరండి
Bheemgal ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరండి
- విద్యార్థుల చేరికల కోసం అధ్యాపకుల అవగాహన ప్రచారం
భీమ్‌గల్ టౌన్ (Bheemgal), ఆంధ్రప్రభ:
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ కోరారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ప్రవేశాల కోసం మంగళవారం భీమ్‌గల్ పట్టణంలో అధ్యాపకుల బృందంతో కలిసి అవగాహన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాలపై వివరించారు.
డాక్టర్ సతీష్ మాట్లాడుతూ, కళాశాలలో బీఏ, బీఎస్సీ, బీకామ్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనుభవం, నైపుణ్యం కలిగిన అధ్యాపకుల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. దోస్త్ సమన్వయకర్త బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
