Bhajans | మానసిక ప్రశాంతత కోసం..

Bhajans | మానసిక ప్రశాంతత కోసం..
Bhajans | ఊట్కూర్, ఆంధ్రప్రభ : భజనతో మానసిక, శారీరక ప్రశాంతత లభిస్తుందని ధర్మ జాగరణ సమితి దొరోల్ల కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. సోమవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా ఇంటిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసారు.ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ భజన మండలి రాత్రి భజనలు (Bhajans ) చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పెళ్లిళ్లు (Marriages) గృహ ప్రవేశాలు, శుభకార్యాలు, ఉత్సవాల సందర్భంగా వారివారి ఇంట్లో భజనలు చేయడం వలన శుభం కలుగుతుందని అన్నారు. భజనలు చేయడం వలన ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయని శాంతి లభిస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన మానవులలోని ప్రతికూల భావాలు తొలగి సానుకూల భావాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భజన పరులు సుధాకర్ రెడ్డి, ఉప్పు ఆంజనేయులు, నాగి రెడ్డి, రామాంజనేయులు, మహేష్ గౌడ్, రాజమూరి, హన్మంతు, డి.రాము, శ్రీనివాస్, తిమ్మప్ప, ఆంజనేయులు, అశోక్ రెడ్డి, కలన్ శ్రీలక్ష్మి, రమేష్, తాయప్ప , హిమ, శశికళ తదితరులు పాల్గొన్నారు.
