అన్నపూర్ణేశ్వరి అలంకారంలో భద్రకాళి
వరంగల్ కల్చరల్ అక్టోబర్ 12 ఆంధ్రప్రభ: శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవిశరన్నవరాత్రులు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం గంటలు 04-00లకు నిత్యహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించారు. ఈ రోజు అమ్మవారికి ఉదయం బ్రహ్మచారిణి, సాయంకాలం దేవజా దుర్గా క్రమాలలో పూజారాధనలు జరిపారు.
ఉదయం మకర వాహన సేవ సాయంకాలం చంద్రప్రభ వాహన సేవ పై ఊరేగించారు. నవదుర్గా క్రమంలోని బ్రహ్మచారిణి దుర్గా క్రమంలో ఆరాధింపబడిన అమ్మవారు సాధకుల దృష్టిని శరీరంలోని స్వాదిస్టాన చక్రంమీద కేంద్రీకరింపజేసి సాధకుడిని విష్ణుమూర్తి.. అనుగ్రహానికి పాత్రులను చేసి అధికారం, జ్ఞానం రెండింటిని ప్రసాదిస్తుంది. దేవజా దుర్గా ఈమె సమస్త దేవతా కోపసంభూత, సాధకుడిని భాదిస్తున్న అసూరీ శక్తులను దునిమి పారేస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు.
