భద్రాద్రికి గోటి బియ్యం తలంబ్రాలు…

భద్రాద్రికి గోటి బియ్యం తలంబ్రాలు…
- చిట్యాలలో తలంబ్రాలతో ఊరేగింపు,
చిట్యాల, ఆంధ్రప్రభ : శ్రీరామదాసు భక్తమండలి చేల్పూర్ వారి ఆధ్వర్యంలో భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం చిట్యాల మండల కేంద్రంలో హనుమాన్ భజన మండలి అధ్యక్షులు వేణు సింగ్ ఆధ్వర్యంలో గోటితో వడ్లు వలవడం, అనంతరం భద్రాది తలంబ్రాలకు గోటి వడ్ల బియ్యం బుధవారం తరలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిట్యాల సర్పంచి తౌటం లక్ష్మి, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, పాల్గొని ఆలయంలో పూజలు నిర్వహించి, మండల కేంద్రం, నుండి ఊరేగింపుగా వెళ్లి చింతలపల్లి, వెంకటరావుపల్లి( సి) హనుమాన్ ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
భక్తులు స్వయంగా గోటితో వడ్లు వలవడం, తలంబ్రాలు సిద్ధం చేయడం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వడ్ల ప్యాకెట్ల పంపిణీ చేయడం ద్వారా లక్షలాది భక్తుల స్వామి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకి అందుతాయని ఈ సేవలో పాల్గొనడం వారి అదృష్టంగా భావిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో, 4వ వార్డ్ మెంబర్ తౌటం నవీన్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా కార్యవాహ బుర్ర సదయ్య , బైరం భద్రయ్య, అల్లం సదయ్య రమేష్, గుండ మణికుమార్ ,వల్లాల ప్రవీణ్, మహిళ భక్తులు విజయ, ఉమా, సుజాత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
