భద్రాచలం, ఆంధ్రప్రభ : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని (Bhadrachala Sri Seetha Ramachandra Swamy) ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి (Andhra Pradesh Senior IAS officer), ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ రామ్‌సుందర్ రెడ్డి (Ramasunder Reddy) కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తొలుతగా శనివారం ఆలయానికి విచ్చేసిన రామ్‌సుందర్ రెడ్డికి ఆలయ లాంఛనాలతో మేళతాళాలతో ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆయన గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అర్చక స్వాములు రామ్‌సుందర్ రెడ్డికి ఆలయ విశిష్టత, చరిత్రను తెలియజేశారు. అమ్మవారి సన్నిధిలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలను, శేషవస్త్రాలను రామ్‌సుందర్ రెడ్డి దంపతులకు అందించటం జరిగింది. ఈ క్రమంలో ఆలయంలోని స్వామివారి ఉత్సవమూర్తులను, కంచర్ల గోపన్న చేయించిన స్వామివారి నగలను, అద్దాల మండపాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవొ శ్రావణ్ కుమార్, అర్చక స్వాములు, పోలవరం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
