మోడల్ స్కూల్లో మెరుగైన ఫలితాలు

జైనూర్/సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ & కాలేజీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటస్వామి తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మొత్తం 133 మంది విద్యార్థుల్లో 131 మంది ఉత్తీర్ణులై 98% ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్లో 112 మంది విద్యార్థుల్లో 105 మంది ఉత్తీర్ణులై 93% ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు.
ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో ఆడ వివేక్ రాజ్ 470 మార్కులకు గాను 454 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు. ఫస్ట్ ఇయర్ బైపీసీలో జాదవ్ పూజ 440 మార్కులకు 425 మార్కులు, సీఈసీలో ఆత్రం లక్ష్మీబాయి 500 మార్కులకు 429 మార్కులు సాధించారు.
సెకండ్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో ముండే గణేష్ 1000 మార్కులకు 937 మార్కులు సాధించగా, సీఈసీలో రాజేంద్ర ప్రసాద్ 883 మార్కులు సాధించారు. బైపీసీలో సయ్యద్ అతీఫ్, రాథోడ్ విద్య ఇద్దరూ 1000 మార్కులకు 949 మార్కులు సాధించారు. జాదవ్ అంకిత కూడా మంచి మార్కులు సాధించినట్లు తెలిపారు.
మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు ఫస్ట్, సెకండ్ ఇయర్లలో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.
