మిర్యాల‌గూడ‌, ఆంధ్ర‌ప్ర‌భ : మిర్యాల‌గూడ‌లోని గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన 556 డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరుతూ ఈ రోజు స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఎదుట‌ ల‌బ్ధిదారులు ధ‌ర్నా చేశారు. డ‌బుల్‌ బెడ్ రూమ్ ఇళ్లు ప‌ట్టాలు ఇవ్వాల‌ని వారు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ల‌బ్ధిదారులు మాట్లాడుతూ 556 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తూ లబ్ధిదారులను ఎంపిక చేశార‌ని, అయితే వారికి పట్టాలు ఇచ్చి అప్పగించ లేద‌ని అన్నారు. సంవత్సర కాలంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి ఆ ఇళ్ల‌ను అప్ప‌గించాల‌ని కోరారు.

Leave a Reply