జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో 432వ అన్నదానం

దామోదర్‌ 5వ వర్ధంతి సందర్భంగా 180 మందికి అన్నప్రసాదం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం 432వసారి బెల్లంపల్లి పట్టణంలోని కాంట అంబేద్కర్‌ చౌరస్తా, పల్లెటూరి బస్టాండ్‌ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులు తదితరులకు అన్నదానం చేశారు.

జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్‌ మాట్లాడుతూ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమాన్ని 432వసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమితి వ్యవస్థాపక సభ్యుడు కీ.శే. గాడెపు దామోదర్‌ ఐదో వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమం ద్వారా సుమారు 180 మంది నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకు ఒకపూట భోజనం అందించినట్లు సతీష్‌ తెలిపారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించేందుకు సమితి సభ్యులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జనహిత సేవా సమితి ఉపాధ్యక్షుడు కందుల రాజన్న, సహాయ కార్యదర్శులు పంతంగి సంతోష్‌, గొడిసెల శేఖర్‌, ఆడే సురేందర్‌, కార్యవర్గ సభ్యులు డోలి సుకుమార్‌, రామిడి గంగయ్య, మహేష్‌, భీమిని కనకయ్య గౌడ్‌, నిచ్చకోల గురుస్వామి, శివ, బోనాల సతీష్‌, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.