మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బీర్ల ఐలయ్య కృతజ్ఞతలు

ప్యాకేజీ–15 పనులకు కేబినెట్‌ ఆమోదం లభించడంపై ధన్యవాదాలు

ఆలేరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రభుత్వ విప్‌, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు. నియోజకవర్గ పరిధిలోని ప్యాకేజీ–15 పనులను ముందస్తుగా పూర్తిచేసేందుకు కేబినెట్‌ ఆమోదం లభించేలా ప్రత్యేక చొరవ చూపినందుకు మంత్రికి ధన్యవాదాలు చెప్పారు.

ఆలేరు నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీ–15 కాలువ పనులను పూర్తి చేసేందుకు మంత్రి సహకారంతో కీలక ముందడుగు పడిందని ఐలయ్య తెలిపారు. సవరించిన అంచనాలతో త్వరలోనే పనులను పూర్తిచేసి, ప్యాకేజీ–15 ద్వారా నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.