- రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
భారత మహిళల క్రికెట్ జట్టు ఈ నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. అయితే తాజాగా జట్టులో ఒక ముఖ్య మార్పు జరిగింది. యువ స్పిన్నర్ శుచి ఉపాధ్యాయ్ గాయపడిన కారణంగా, రీప్లేస్మెంట్ ప్రకటించింది బీసీసీఐ. శుచి ఉపాధ్యాయ్ స్థానంలో అనుభవజ్ఞురాలైన ఎడమచేతి ఆర్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ను బీసీసీఐ ఎంపిక చేసింది.
ఈ మేరకు (గురువారం) అధికారికంగా ప్రకటన చేస్తూ, “ఇంగ్లాండ్ పర్యటనకు శుచి ఉపాధ్యాయ్ స్థానంలో రాధా యాదవ్‌ను ఎంపిక చేసినట్లు మహిళల సెలెక్షన్ కమిటీ తెలిపింది.
“20 ఏళ్ల శుచి ఉపాధ్యాయ ఇటీవల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు సిరీస్ తో వన్డేల్లో అరంగేట్రం చేసింది. అయితే, శుచి ఎడమ కాలుకు గాయం అయింది. బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన ప్రీ-టూర్ క్యాంప్‌లో ఈ గాయం కనుగొనబడింది” అని కమిటీ పేర్కొంది. ఈ క్రమంలోనే శుచి ఉపాధ్యాయ కు రీప్లేస్మెంట్ గా రాధా యాదవ్ ను ఎంపిక చేసింది బీసీసీఐ.
కాగా, భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో (ఐదు టి20లు, మూడు వన్డేలు) మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడనుంది.
టీ20 సిరీస్ షెడ్యూల్:
తొలి టీ20I – జూన్ 27
రెండో టీ20I – జూన్ 29
మూడవ టీ20I – జూలై 1
నాలుగో టీ20I – జూలై 4
ఐదో టీ20 – జూలై 6
వన్డే సిరీస్ షెడ్యూల్:
మొదటి వన్డే – జూలై 10
రెండో వన్డే – జూలై 13
మూడో వన్డే – జూలై 16
టీమిండియా తుది జట్లు :
టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (ఉపకెప్టెన్), షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హార్లిన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి, అమన్ జోత్ కౌర్, అరుందతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయలి సత్‌ఘరే, రాధా యాదవ్
వన్డే జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (ఉపకెప్టెన్), ప్రతికా రావల్, హార్లిన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), తేజల్ హసాబ్‌నిస్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి, అమన్ జోత్ కౌర్, అరుందతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయలి సత్‌ఘరే, రాధా యాదవ్
భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై విజయ లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

