బీసీ ఐక్యవేదిక నాయకుల అరెస్టు
మక్తల్, ఆంధ్రప్రభ : అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరని బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె.రామాంజనేయులు గౌడ్ (K.RamAnjaneyulu Goud) అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్లు అమలయ్య వరకూ ఉద్యమిస్తామని అన్నారు. ఈ రోజు రిజర్వేషన్ల సాధనలో భాగంగా బీసీ పొలిటికల్ జేఏసీ రాజ్ భవన్ ముట్టడి పిలుపునిచ్చిన సంగతి తెలిసింది. ఇక్కడ నాయకులు రాజ్ భవన్ ముట్టడికి వెళ్లకుండా మక్తల్ లో పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద బీసీ ఐక్యవేదిక (BC United Forum) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. రామాంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. తాము వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం అరెస్టు చేయడాన్ని బీసీఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పైన 42శాతం రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే ఇలా బీసీ ఉద్యమ నాయకులను అరెస్టు చేయడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అరెస్టయిన వారిలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి జి. రంగప్ప యాదవ్, నారాయణపేట జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ ముదిరాజ్ ,మక్తల్ నియోజకవర్గ యువత అధ్యక్షులు ఆశోక్ గౌడ్,మక్తల్ మండల అధ్యక్షులు వి. రవికుమార్ తదితరులు ఉన్నారు.
