జుక్కల్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

రూ. 51 వేల తొలి బహుమతి
జుక్కల్/కామారెడ్డి,ఆంధ్రప్రభ: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా జుక్కల్ నియోజకవర్గ స్థాయి బతుకమ్మ సంబరాలను మంగళవారం జుక్కల్ మండల కేంద్రంలోని గుండుర్ రోడ్డు వద్ద ఘనంగా నిర్వహించనున్నారు.

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సతీమణి తోట అర్చన ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సంబరాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మొదటి బహుమతి రూ. 51,000, రెండో బహుమతి రూ. 25,000, మూడో బహుమతిరూ 11,000, కన్సోలేషన్ బహుమతులు: 8 మందికి అందించనున్నారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను భావితరాలకు, ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నియోజకవర్గంలోని ఆడపడుచులందరూ భారీ సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేయాలని కోరారు. హాజరయ్యే అందరికీ భోజన వసతి కల్పించినట్లు తెలిపారు.