NLG | ఉపాధి హామీ కూలీలకు మౌలిక వసతులు కల్పించాలి : కలెక్టర్

మద్దిరాల, మార్చి 5 (ఆంధ్రప్రభ) : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు రాస్తుండగా విద్యార్థుల పరీక్ష పత్రాలను పరిశీలించి అనంతరం ప్రధానోపాధ్యాయులు మేడిపల్లి శ్రీనివాస్ ను పాఠశాలలో ఉపాధ్యాయులంద‌రూ హాజరయ్యారా అడిగి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎంఈఓ కాట్ల రవికుమార్ తో మాట్లాడుతూ… పాఠశాలను ఆదర్శ పాఠశాలగా చేయడానికి సరైన తరగతి గదులు, వసతులు ఉన్నాయా ? అని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా వారితో మాట్లాడి ఉపాధి హామీ పనుల గురించి తెలుసుకొని ఉపాధి కూలీలకు మౌలిక వసతులు కల్పించాలని, ఉపాధి హామీ అధికారులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలో రైతు మిత్ర ఆగ్రోస్ దుకాణంలో యూరియా బస్తా ఎంతకు అమ్ముతున్నారని రైతును అడిగి తెలుసుకుని రూ.300లకు యూరియా బస్తా అమ్ముతుండగా బిల్లు పట్టితో సహా చూసి, స్టాకును పరిశీలించి స్టాక్ లో తేడాగా ఉండడంతో రైతు మిత్ర ఆగ్రోస్ ఎరువుల మందుల షాపు సీజ్ చేయాలని మండల వ్యవసాయ అధికారి అనీషా రూహికి సూచించారు. అదేవిధంగా మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మోడల్ హౌస్ ను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం మండల పరిధిలోని కుక్కడంలో పౌల్ట్రీ ఫామ్, పశువుల పాక నిర్మాణాలను పరిశీలించారు.

ముకుందాపురంలో హర్టికల్చర్ ద్వారా 8ఎకరాల మామిడి తోటను పరిశీలించి హార్టికల్చర్ ను రైతులు ప్రోత్సహించే విధంగా రైతులకు సబ్సిడీతో వస్తున్న డ్రిప్ ను అందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరైనా రైతులు పశువుల పాకలు, మామిడి తోటలు, నిమ్మ తోటలు, పామ్ ఆయిల్ తోటలు వేసుకునే వారు ఉంటే వెంటనే మంజూరు చేయాలని హార్టికల్చర్ ను ప్రోత్సహించాలని, తోటల్లో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బి.నాగయ్య, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, త‌హ‌సీల్దార్ అమీన్ సింగ్, ఎంఈవో కాట్ల రవి కుమార్, ఏపీవో వెంకన్న చారి, అశోక్ రమేష్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *