బాస‌ర ఆల‌యం ద‌ర్శ‌నాలు నిలిపివేత‌

బాస‌ర‌, ఆంధ్ర‌ప్ర‌భ : సంపూర్ణ చంద్ర గ్రహణం (Total lunar eclipse) సంద‌ర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి శ్రీ జ్ఞాన సరస్వతి (Saraswati) దేవి ఆలయంతోపాటు ఉప ఆలయాలను క‌వాట బంధ‌నం చేసిన‌ట్లు ఆలయ స్థాన చార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజు పూజారి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆలయంలోని అమ్మవార్లకు ఉప ఆలయాలలో మహా నివేదన, హారతి నిర్వహించి అనంత‌రం క‌వాట బంధ‌నం చేశారు.

సోమవారం (Monday) తెల్లవారుజామున నాలుగు గంటలకు గ్రహణ అనంతరం ఆలయంతో పాటు ఉప ఆలయాలను గోదావరి (Godavari) జలాలతో సంప్రోక్షణ చేసి ఉదయం 7.30 అమ్మవార్లకు అభిషేక అర్చన పూజలు నిర్వహించి భక్తులకు సర్వదర్శనం, ఇతర ఆర్జిత సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

మ‌క్త‌ల్‌లో ఆల‌యం మూసివేత‌.. రేపు ఆల‌య సంప్రోక్ష‌ణ‌
మక్తల్ , ఆంధ్రప్రభ : సంపూర్ణ చంద్రగ్రహణం నేప‌థ్యంలో నారాయణపేట జిల్లా (Narayanpet district) మక్తల్ (Maktal) పట్టణంలో ప్రసిద్ధ‌గాంచిన శ్రీశ్రీశ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆల‌యంలో ద‌ర్శ‌న‌లు నిలిపి వేసిన‌ట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇ.ప్రాణేషాచారి తెలిపారు. ఈ రోజు ఉద‌యం 11.30 గంట‌ల‌కు ఆల‌యాన్ని మూసి వేసిన‌ట్లు చెప్పారు. రేపు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా స్పర్శ కాలం రాత్రి 9:56 గంటలకు గ్రహణ మోక్ష కాలం రాత్రి 1:28 గంటలకు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆలయం సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ తదుపరి తెరపడుతుందని భక్తులు దర్శనాలు యధావిధిగా చేసుకోవచ్చని ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారి తెలిపారు.

Leave a Reply