రోడ్డెక్కిన బ్యాంకర్లు..
కొత్తగూడెంలో భారీ ర్యాలీ
ఐదు రోజుల పనిదినాల అమలుతో పాటు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన
యూఎఫ్‌బీయూ పిలుపుతో విధులు బహిష్కరించిన బ్యాంకు ఉద్యోగులు..
నిలిచిన బ్యాంకింగ్ సేవలు
కొత్తగూడెం, ఆంధ్రప్రభ : యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐదు రోజుల పనిదినాల అమలుతో పాటు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో బ్యాంకు సిబ్బంది ర్యాలీలో పాల్గొని తమ డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఉద్యోగుల సమ్మె కారణంగా జిల్లాలోని బ్యాంకుల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి. ఆర్థిక లావాదేవీలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని కామ్రేడ్ అరుణ్‌కుమార్ నారేడ్ల, కామ్రేడ్ కోలా నవీన్ స్పష్టం చేశారు.
బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించాలని వారు కోరారు. ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ అధికారులు, సిబ్బంది సందీప్, నాగేంద్రతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
