అయిదు రోజుల బ్యాంకింగ్ వారంపై బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం దేశవ్యాప్త సమ్మె..
భోపాల్‌లో నిరసన ర్యాలీ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంతో పాటు పలు పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం సహా పలు బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయడంతో పాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ)పై ఉన్న విభేదాలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెన్షన్‌కు సంబంధించిన సమస్యలు సహా పలు పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా భోపాల్‌లో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు.
