Bakki Venkataiah | సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో..

Bakki Venkataiah | సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో..

  • ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య..

Bakki Venkataiah | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని వంజరి సంఘంలో ఇవాళ‌ నూతన ఎస్సీ ఎస్టీ సర్పంచుల సన్మాన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్యఅతిథిగా హాజరై సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలను ఎదుర్కొని ప్రపంచ దేశాల్లో పేరుపొందిన మహిళ సావిత్రిబాయి పూలే అని, ఆమె చేసిన త్యాగాల వల్లె మహిళలకు గుర్తింపు లభించిందన్నారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురువు బాపు జ్యోతిరావు పూలే అని ఎస్సీలంతా తల ఎత్తుకుని తిరుగుతున్నామంటే అంబేద్కర్ పుణ్యమేన‌న్నారు. ఇంత జరుగుతున్నా.. అక్కడక్కడ ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని, అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందన్నారు. దేశంలో అందరం కలిసి మెలిసి ఉన్నట్లయితే మహనీయుల ఆశయాలను కొనసాగించే వారిని అవుతామన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎస్సీ ఎస్టీ సర్పంచులను అయన శాలువాలతో సన్మానించారు.

Bakki Venkataiah

ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేష్, డీఎస్ డీఓ సింధు, ఏఎస్ఓ లింగేశ్వర్, హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, టీవీఎస్ జిల్లా అధ్యక్షులు సంజీవ్, మాల మానాడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సామల అశోక్, డీవీఎఫ్ మండల అధ్యక్షులు చంద్రం, కార్యదర్శి నరేష్, బైండ్ల నందు, శ్రీనివాస్ నాయక్, వినోద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply