- రీరిలీజ్ కు సిద్ధమైన బాహుబలి
తెలుగు సినిమాను పాన్-ఇండియన్ వేదికపై స్థాపించిన ఎపిక్ సాగా బాహుబలి. దర్శకదీరుడు ఎస్.ఎస్ రాజమౌలీ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజయ్యి 10 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా, మేకర్స్ ‘బాహుబలి: ది ఎపిక్’తో పదేళ్ల వేడుకను జరుపుకోనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ కొత్త వెర్షన్‌లో బాహుబలి: ది బిగినింగ్ (2015) & బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017) సినిమాలను ఒకటిగా జోడించి, కొన్ని కొత్త సన్నివేశాలు కూడా కలిపి, ఒక కొత్త అనుభూతి అందించబోతున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తారు.