రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!

కోడూరు – ఆంధ్రప్రభ : బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్స్ కి రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీలు శనివారం విజయవాడలోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ నందు జరిగాయి.

ఈ బ్యాట్మెంటన్ పోటీలలో కోడూరు డీసీసీబీ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఎం వెంకటేశ్వర్లు, నందిగామ బ్యాంక్ నుంచి శ్రీరామ్ ఛాంపియన్ లగా నిలచి ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం, మెమెంటోస్ అందుకున్నట్లు మచిలీపట్నం కేబీసీసీ బ్యాంక్ సీఈవో శ్యామ్ మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను సీఈవో అభినందించారు.

Leave a Reply