బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు
సమావేశానికి హాజరైన మంత్రులు
పాల్గొన్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
ఈనెల 19వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు బీఏసీ సమావేశంలో తీర్మానం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాసనసభ భవనంలోని స్పీకర్ చాంబర్లో ప్రారంభమైన బీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు హాజరయ్యారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ :
ఈనెల 13న (రేపు) గవర్నర్ ప్రసంగంపై చర్చ
14న హోలీ సెలవు
15 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సమాధానం
16న సెలవు
17, 18న ప్రభుత్వ బిజినెస్
19న బడ్జెట్
20న సెలవు
21న బడ్జెట్‌పై సాధారణ చర్చ
22,24,25,26 పద్దులపై చర్చ
27 ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ