ఘ‌నంగా ఆజాద్‌ జయంతి వేడుకలు

ఘ‌నంగా ఆజాద్‌ జయంతి వేడుకలు

తిరుపతి, ఆంధ్రప్రభ: మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులని, గాంధీయవాది, భారత స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించాడని, స్వతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ అని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మైనారిటీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి జాతీయ విద్యా దినోత్సవ (National Education Day) సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఈడీ హరినాథ్ రెడ్డితో కలిసి వారి చిత్రపటానికి డి ఆర్ ఓ నరసింహులు పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈసంద‌ర్భంగా డీఆర్ఓ నరసింహులు మాట్లాడుతూ… మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, గాంధేయవాది భారత స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన నాయకుడని తెలిపారు. స్వతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి, ప్రాథమిక విద్యను అందరికీ అందించాలన్న దిశగా ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (Maulana Abdul Kalam Azad) నాయకత్వంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రముఖ విద్యాసంస్థల స్థాపనకు పునాదులు వేశారని పేర్కొన్నారు.

అలాగే హిందూ–ముస్లిం ఐక్యతకు కృషి చేసిన లౌకికవాది, దేశ ఐక్యతకు అంకితభావంతో పనిచేసిన మహానుభావుడన్నారు. మౌలానా ఆజాద్ స్ఫూర్తితో ముఖ్యంగా ముస్లిం మైనారిటీ (Muslim Minority) పిల్లలకు విద్యఅందేలా ప్రయత్నాలు కొనసాగించాలని, బాలురతో పాటు బాలికలకు సమాన విద్యా అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న మైనారిటీ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ అందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంఘ లీడర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply