హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

​నకరికల్లు, ఆంధ్రప్రభ: నకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామంలో బుధవారం లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ , సుఖ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాల, ఆరోగ్య సబ్ సెంటర్ ప్రాంగణంలో గ్రామ ప్రజలకు, విద్యార్థులకు వ్యాధుల నివారణ పద్ధతులపై చైతన్యం కల్పించారు.

​ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ వ్యాప్తి చెందే మార్గాలు, నివారణ చర్యలు, సుఖ వ్యాధుల ప్రధాన లక్షణాలను వివరించారు. గర్భిణీ స్త్రీల నుండి బిడ్డలకు సిఫిలిస్, హెపటైటిస్-బి వ్యాధులు సంక్రమించకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, 2017 హెచ్‌ఐవీ చట్టం, అలాగే జాతీయ టోల్ ఫ్రీ నంబర్ 1097 మరియు క్యూఆర్ కోడ్ వినియోగం గురించి సమగ్రంగా తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి గ్రామంలో చైతన్య ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో జోనల్ సూపర్వైజర్ విశ్వేశ్వరరావు, హెచ్‌ఎం శ్రీనివాసరావు, ఏఎన్ఎం ఆనంది భాయ్, ఎంఎల్ హెచ్ పి పుష్పలత, లింక్ వర్కర్ దయామని, అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.