వన్యప్రాణుల సంరక్షణపై అవగాహణ..
వన్యప్రాణుల సంరక్షణపై అవగాహణ..
ఖానాపూర్ లో వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభం
ఖానాపూర్ టౌన్ , అక్టోబర్ 2 (ఆంధ్రప్రభ) : వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎఫ్ డీ వో కడారి అనిత జెండా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది కార్యాలయం నుండి కొమురం భీం చౌరస్తా మీదుగా తర్లపాడు, సత్తెనపల్లి,దిలావర్పూర్, ఖానాపూర్ వరకు ర్యాలీ చేపట్టి వన్యప్రాణులు, అడవుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకుముందు ఎన్టీఆర్ చౌరస్తా, తర్లపాడులో మానవహారం పాటించి వన్య ప్రాణుల మనుగడ పెంపొందించాలని అవగాహన కల్పించారు.
అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎఫ్ డీ వో కడారి అనిత మాట్లాడుతూ.. వన్యప్రాణులను హతమార్చినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేస్తూ అటవీ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు. అక్టోబర్ 2 నుండి 8 వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎఫ్ ఆర్ వో కిరణ్ కుమార్, ఖానాపూర్ డివిజన్ పరిధిలోని కడెం, పెంబి, దస్తురాబాద్, మామడ మండలాల ఎఫ్ ఎస్ వో లు, బీట్ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
