Awareness conference | ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి

Awareness conference | ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి

  • శ్రీవశిష్ట కళాశాల జిఎం.వంశీ

Awareness conference | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయని అది శ్రీవశిష్ట జూనియర్ కళాశాల ప్రత్యేకత అని జీఎం వంశీ అన్నారు. ఇవాళ‌ హుజూర్‌నగర్ పట్టణంలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ విద్య పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధ్యాపకుడు విద్యార్థికి చదువు బోధించడంతో పాటు, విషయ అవగాహన కలిగించడం, ఆ విషయాన్ని చదివించడం వలన ప్రతి విద్యార్థి ప్రయోజకుడుగా మారుతారన్నారు.

విద్యార్థి చదువుతున్న కళాశాల పరిసరాలు ఆందోళన కలిగించకుండా ఆహ్లాదంగా ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా చదవగలుగుతారని, ఇంటర్ విద్యలో విద్యార్థికి నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవడం వలన ఆయా విషయాలలో రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శ్రీవశిష్ట జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల విద్యార్థుల ఆకాంక్షల కనుగుణంగా విద్యా బోధన జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ అనూప్ చక్రవర్తి, వైస్.ప్రిన్సిపాల్ మట్టపల్లి రవీందర్ విద్యార్ధిని విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply