Awards | ఆదివాసి ఫోటోగ్రాఫర్లకు అవార్డులు…

Awards | ఆదివాసి ఫోటోగ్రాఫర్లకు అవార్డులు…

Awards | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని కొమరం భీం ఫోటో స్టూడియో ఆదివాసి ఫోటోగ్రాఫర్లు ఆత్రం మాధవ్ రావు, ఆయన కూతురు ఆత్రం అమతలకు మెగా హెల్పింగ్ ఫౌండేషన్ వారు ఉగాది పండుగను పురస్కరించుకొని హైదరాబాదులో నిర్వహించిన మెగా ఈవెంట్ కార్యక్రమంలో మాధవ్ రావుకు గోల్డెన్ నంది అవార్డు, ఆయన కూతురు ఆత్రం అమతకు ఐకానిక్ టాలెంట్ అవార్డులను అందించినట్లు అవార్డు గ్రహీతలు తెలిపారు.

ఫోటోగ్రఫీ చేసిన సేవలు ఆదివాసి చిత్ర సేవలపై మెగా హెల్పింగ్ ఫౌండేషన్ వారు ఆహ్వానించి, ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు పి శిరీష రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎస్ యాదగిరి, కార్యదర్శి మహేష్ చేతుల మీదుగా ఈవెంట్ కార్యక్రమంలోఅవార్డులు ఇచ్చారని అవార్డు గ్రహీతలు మాధవరావు, అమత తెలిపారు.

Awards |

అవార్డులు పొందినందుకు ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ అవార్డులు ఇచ్చిన మెగా హెల్పింగ్ ఫౌండేషన్ చైర్మన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపినట్లు వారు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతం నుండి ఆదివాసి ఫోటోగ్రాఫర్లకు గోల్డెన్ నంది, ఐకానిక్ టాలెంట్ అవార్డులు పొందడం ఎంతో సంతోషకరమని ఆదివాసి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply