Award | వ్యవసాయ అధికారికి ఉత్తమ పురస్కారం…

Award | వ్యవసాయ అధికారికి ఉత్తమ పురస్కారం…
Award | దండేపల్లి, ఆంధ్రప్రభ : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా దండేపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి గోర్ల అంజిత్ కుమార్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండలంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యసాయనికి కావాల్సిన ఎరువులు, ప్రభుత్వం నుంచి సబ్సిడీపై వచ్చిన యంత్రలను రైతులకు అందించి వారికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం వల్ల ప్రభుత్వం గుర్తించి పురస్కార పత్రాన్ని అందించందన్నారు. జిల్లా కలెక్టర్ చేతుల మీద పురస్కార పత్రం అందుకోవడం చాలా అదృష్ట మన్నారు.మండలంలోని రైతులకు మరింత సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
