Award | ఘనంగా సర్వజన వికాస్ మంచ్ ప్రథమ వార్షికోత్సవం

Award | ఘనంగా సర్వజన వికాస్ మంచ్ ప్రథమ వార్షికోత్సవం
Award | జైనూర్, ఆంధ్రప్రభ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, జైనూర్ మండలంలోని మార్లవాయి లోని పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు గుస్సాడీ శిక్షణ కేంద్రంలో సర్వజన వికాస్ మంచ్ సంస్థ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సంస్థ సభ్యులు అడ్వకేట్ రాఘవేంద్ర(తమిళనాడు)శివమూర్తి (కర్ణాటక) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ అధ్యక్షత వహించారు. ఈ వార్షికోత్సవ సభలో ప్రధానంగా చర్చించిన అంశాలుఆదివాసీ హక్కుల పరిరక్షణ,గిరిజన భూముల రక్షణ,భూ ఆక్రమణల నివారణ,పేదలు, నిరుపేదలకు చట్టపరమైన అవగాహనవిద్యా చైతన్యం పెంపొందించడం,సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నివారణ చట్టం–1989 ప్రకారం గిరిజనులు, దళితుల, మైనారిటీలు వెనుకబడిన జాతులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టి వారికి న్యాయం అందించడమే తమ లక్ష్యమని వివరించారు.
అలాగే పెసా చట్టం–1996 అమలుపై అవగాహన కల్పించడం, గ్రామ సభల అధికారాలను బలోపేతం చేయడం, గిరిజన ప్రాంతాల్లో స్వయం పాలనను కాపాడడం సంస్థ ప్రధాన కార్యక్రమాలుగా కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు.వార్షికోత్సవ కార్యక్రమాలునూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మానం చేయడంతో పాటు వారి విధులుహక్కులు మరియు చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహణ పై అవగాహన కల్పించారు.
ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు విద్యా చైతన్య కార్యక్రమాలు ఆదివాసి సమాజానికి విద్యార్థులు, యువత, మహిళలు, సామాజిక కార్యకర్తల కోసం ప్రత్యేక సదస్సులు,సంస్థ ప్రతినిధులు భవిష్యత్తులో అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కేసులు వాదించేందుకు స్వచ్ఛంద న్యాయసహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఒక వేదికగా నిలుస్తామని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ మరియు పెన్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలోపుల్లర గ్రామపంచాయతీ సర్పంచ్ వెడ్మ జంగుబాయి, కోహినూర్( బి) సర్పంచ్ సిడం విజయలక్ష్మి,శెట్టిహడుపునూర్ సర్పంచ్ ఆత్రంవిజయలక్ష్మి, పోచ్చలోద్ది సర్పంచ్ మనోహర్, జెండాకూడా సర్పంచ్ ఉయిక చందన్ షా, కనక సుదర్శన్, కనక ఆనందరావు, సీడం రమేష్, హెడ్ మాస్టర్ అశోక్, ఆత్రం చొక్క రావ్, వెంకటేశ్వర్ రావ్, భుజంగ్,కనక యదవ్ రావ్, గేడం మారుతి, ఆత్రం పద్మ రాజేశ్వర్, ఆత్రంభగవంత్రావ్, సెద్మకిభగవంత్ రావ్, ఆత్రం రాజేశ్వర్, కనక రూప బాయి, పార్వతి, భరత్, పుల్ల బాయి, సర్జబాయి, గేడం శ్రీధర్, ఆడ సోనే రావ్, శ్రీనివాస్ జూగాది రావ్, విఠల్, మరు, జంగు, తదితరులు పాల్గొన్నారు.
