ఆత్మకూర్ మున్సిపల్ చైర్మన్ గా ఆవుల గోవిందరాజులు ఏకగ్రీవం

ఆత్మకూర్, ఆంధ్రప్రభ: ఆత్మకూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ వేసిన డాక్టర్ ఆవుల గోవిందరాజులు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ బేబీ తెలిపారు. ఆత్మకూర్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎస్టి కి రిజర్వ్ కావడంతో తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ గోవిందరాజులు, వైసిపి పార్టీ నుంచి డాక్టర్ ప్రియాంక బాయి నామినేషన్లు వేశారు. ఇరు పార్టీల మధ్య చర్చలు ఫలించిన అనంతరం తెలుగుదేశం పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థి గా ప్రకటిస్తూ గోవిందరాజులను ఎన్నికల అధికారి డిక్లరేషన్ ఫామ్ ను చైర్మన్ అభ్యర్థి డాక్టర్ గోవిందరాజులు అందజేశారు. దీంతో టిడిపి వర్గాలు చైర్మన్ అభ్యర్థికి శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాల్లో మునిగిపోయాయి.