Avanigadda | నీటిపారుదల శాఖ ఏఈ మృతి..
Avanigadda, ఆంధ్రప్రభ : చల్లపల్లిలో నివసిస్తూ సుదీర్ఘ కాలం నీటిపారుదల శాఖ ఏఈగా విధులు నిర్వహించిన పులిగడ్డ వెంకటేశ్వరరావు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. గత ఏడాది తీవ్ర అనారోగ్యానికి గురై, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన వెంకటేశ్వరరావు చికిత్స అనంతరం ఆరోగ్యం కోలుకోవటం కోసం సెలవు పై ఉన్నారు. నాలుగు రోజుల క్రితం మళ్ళీ అనారోగ్యంతో విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుఝామున మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటేశ్వరరావు పార్థివ దేహానికి వారి స్వగ్రామం అవనిగడ్డ మండలం పులిగడ్డలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

