Auto Drivers | ఆటో డ్రైవర్ల ఆందోళన

Auto Drivers | ఆటో డ్రైవర్ల ఆందోళన
- హామీలు నెరవేర్చాలని అసెంబ్లీ ముట్టడికి యత్నం
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అసెంబ్లీని ముట్టడించాలని ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఆటో సంఘాల నేతలను బషీర్బాగ్ వద్ద పోలీసులకు అడ్డుకున్నారు.
ఆటో యూనియన్ ముట్టడి పిలుపుతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో ఆందోళనలు చేయవద్దని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ ముట్టడికి వస్తున్న
రెండేళ్లు గడిచినా పట్టించుకోని ప్రభుత్వం
ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా తమ ఉపాధి పూర్తిగా దెబ్బతిందని ఆటో డ్రైవర్లు వాపోయారు. రోజువారీగా వచ్చే ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోయారని, కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతి ఏడాది ఆటో డ్రైవర్లకు రూ. 11,000 ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, రెండేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా అందలేదని ఆరోపించారు. హామీలు చాలానే ఇచ్చినా, వాటిని అమలు చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆటో డ్రైవర్లు విమర్శిస్తున్నారు.
