కోడూరులో దారుణం..
- రహదారి వివాదంలో వ్యక్తిపై కత్తులతో దాడి
కోడూరు, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా కోడూరు మండలం శ్రీరాపురంలో రహదారి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిపై పలువురు కత్తులతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
