వికారాబాద్ లో దారుణం

వికారాబాద్ లో దారుణం

వికారబాద్ జిల్లా కలకచర్ల మండలంలో దారుణం జరిగింది. ఒకే కుంటుంబంలో ముగ్గుర్ని చంపాడు. భార్య, ఇద్దరు పిల్లలు, వదినను వేపూరి యాదయ్య అనే వ్యక్తి అతిదారుణంగా నరికి చంపడం సంచలనం అయ్యింది. యాదయ్య కుమార్తెను కూడా చంపడానికి ప్రయత్నిస్తే ఆమె తప్పించుకుంది. హత్యల తర్వాత గొంతు కోసుకుని యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే.. యాదయ్య ఎందుకు ఇలా చేసాడు..? అనేది తెలియాల్సివుంది.

Leave a Reply