HYD | పీర్జాదిగూడలో దారుణం…

భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్


HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పీర్జాదిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను హత్య చేసిన ఆరోపణలపై భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51), భార్య సునీత (44) మధ్య ఆగస్టు 6న గొడవ జరిగింది. ఈ క్రమంలో సునీత తన భర్త చేతులు, కాళ్లను చీరతో కట్టి సెంట్రింగ్‌ కర్రతో తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం సత్యనారాయణ వాహనం నుంచి జారిపడి గాయపడ్డాడని కుమారుడికి సునీత చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అయితే సత్యనారాయణ మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, సునీతను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.