Atmakur | అభివృద్ధికి సహకరించండి…

Atmakur | అభివృద్ధికి సహకరించండి…
- పట్టణంలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు..
- కార్యకర్తల సమావేశంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి..
Atmakur | ఆత్మకూర్, ఆంధ్రప్రభ : ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధికి స్వీకారం చుట్టామని, అభివృద్ధి కి సహకరించాలని, మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, రాష్ట్ర మంత్రి వాకిడి శ్రీహరి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటివరకు మండలంలో జూరాల ఆత్మకూర్ వంతెన నిర్మాణం కోసం 123 కోట్లు, ఆస్పత్రికి 50 కోట్లు మార్కెట్ నూతన భవనం అభివృద్ధి కోసం 40 కోట్లు, మున్సిపల్ పట్టణ అభివృద్ధికి 15 కోట్లు, మంజూరి చేయడం జరిగిందన్నారు.
ఆత్మకూరు మండలం పట్టణ మరింత అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా సమన్వయంతో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో 22 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే కావటానికి ఎంతో ప్రయాసపడ్డానని, మున్సిపల్ ఎన్నికలు సీట్లు రానివారికి తప్పకుండా అవకాశాలు వస్తాయని కల్పించే బాధ్యత తనదేనని ఎలాంటి సందేహం లేదని ఆయన కార్యకర్తలకు భరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పరమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి రహమతుల్లా, పట్టణ అధ్యక్షుడు నల్లగొండ శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, మొగిలి గంగాధర్ గౌడ్, వెంకట్, నర్సింగ్ రావు, బాలకృష్ణారెడ్డి, శారదా, శివకుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
