పునరావాస కేంద్రంలో.. కలెక్టర్

చిలకలూరిపేట టౌన్, అక్టోబర్ 29, (ఆంధ్రప్రభ) : పట్టణంలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటైన పునరావాస కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పరిశీలించారు. అక్కడ తాత్కాలికంగా ఆశ్రయం పొందిన వారికి అందిస్తున్న సౌకర్యాల పై ఆమె వివరాలు, మౌలిక వసతులు, శానిటేషన్, తాగునీటి సరఫరా, విద్యుత్ వంటి అంశాల్లో అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రంలో ఉన్న పిల్లలకు బిస్కెట్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, డి.ఈ రహీం, పలువురు అధికారులు పాల్గొన్నారు.
