అబుదాబిలో ఆసియా కప్ 2025 కిక్ స్టార్ట్..

  • బరిలోకి రషీద్ ఖాన్ సేన ..
  • హాంకాంగ్‌కు సవాల్

అబుదాబి: ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆసియా కప్ 2025 చివరికి అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో గ్రూప్ బిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ – హాంకాంగ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్…

ఆసియా కప్‌లో శక్తివంతమైన జట్టుగా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో క్లియర్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కెప్టెన్ రషీద్ ఆధ్వర్యంలోని ప్రపంచ స్థాయి స్పిన్ దళం వారి ప్రధాన బలం. యూఏఈ పిచ్‌లపై అనుభవం, క్రమం తప్పని ప్రదర్శన వీరికి ప్లస్ అవుతుంది.

బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ దూకుడు, ఇబ్రహీం జాద్రాన్ ఫామ్‌లో ఉండటం ఆఫ్ఘన్లకు అదనపు బలం. మంచి బ్యాటింగ్ పిచ్‌గా భావిస్తున్న ఈ వేదికపై పెద్ద స్కోరు దిశగా అడుగులు వేయాలని జట్టు లక్ష్యం పెట్టుకుంది.

హాంగ్ కాంగ్ ల‌క్ష్యం అదే…

ఇక హాంకాంగ్ ఐదవసారి ఆసియా కప్‌లోకి అడుగుపెడుతోంది.. క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో టోర్నమెంట్‌కు అర్హత సాధించిన హాంగ్ కాంగ్, ఇక్కడ కూడా తమ సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కెప్టెన్ యాసీమ్ మూర్తజా నాయకత్వంలో, సీనియర్లు అన్షుమన్ రాథ్, బాబర్ హయత్లపై జట్టు ప్రధానంగా ఆధారపడి ఉంది.

భారత అభిమానులు ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్లో ప్రత్యక్ష ప్రసారం లేదా, SonyLIV యాప్, వెబ్‌సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.

Leave a Reply