వైరా దక్షిణముఖ దాసాంజనేయ స్వామి ఆలయంలో అష్టోత్తర పూజలు
వైరా అక్టోబర్ 6 (ఆంధ్రప్రభ): వైరా ప్రాజెక్టు అలుగుల వద్ద వేంచేసి ఉన్న దక్షిణముఖ దాసాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం అష్టోత్తర పూజలు, విశేష అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ట్రాన్స్కో డిపార్ట్మెంట్ ఉద్యోగి బొడ్డు రవివర్మ సత్యసాయినాథ్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు.
ఆలయాన్ని దర్శించిన ప్రముఖ న్యాయవాది మందడపు శ్రీనివాసరావు
తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ సభ్యుడిగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది, వైరా వాస్తవ్యులు మందడపు శ్రీనివాసరావు తమ కుమార్తె దివ్య (హైకోర్టు అడ్వకేట్)తో కలిసి దాసాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మందడపు శ్రీనివాసరావును కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఆలయ అభివృద్ధికి సహకారం – కమిటీ అభినందనలు
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి మందడపు శ్రీనివాసరావు నిరంతరం అందిస్తున్న సహకారాన్ని ఆలయ కమిటీ ప్రత్యేకంగా కొనియాడింది. అలాగే ఆలయ పురోభివృద్ధికి సహకరించిన ఆయన కుమార్తె దివ్యకు కూడా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆలయ కమిటీ చైర్మన్: చావా శ్రీనివాసరావు
కమిటీ సభ్యులు & సలహాదారులు: చింతనిప్పు వెంకటేశ్వరరావు, పాపినేని రమేష్, బండారుపల్లి రవీంద్ర బాబు, చెరుకూరి శ్రీనివాసరావు, జాలాది కోటేశ్వరరావు, కొత్తూరి వెంకటరమణ, మేకా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆదిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్ర బార్ అసోసియేషన్ సభ్యులుగా ఎన్నికైన శ్రీనివాసరావు.. జన్మదిన వేడుకలు జరుపుకున్న రవివర్మ సత్యసాయినాథ్లు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ సేవలో ముందుండాలని ఆశీర్వచనాలు అందించారు.
