ఆశీర్వాద దీపాలతో మోదీకి జన్మదిన శుభాకాంక్షలు
17న సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా దీపం వెలిగించాలి..
బీజేపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొనాలి
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 17న సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ జాతీయ పార్టీ విభాగాల సహ సమన్వయకర్త ఎస్. విష్ణువర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ సుమారు 25 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలని సూచించారు. మోదీ అందిస్తున్న సేవలకు ప్రతీకగా ప్రతి కుటుంబం తమ ఇంటి వద్ద దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు.
నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో నీతివంతమైన, పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తూ దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నారని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మోదీ సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన జన్మదినాన్ని ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలనే ఉద్దేశంతో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు.
సెప్టెంబరు 17న సాయంత్రం 7 గంటలకు పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి కుటుంబం తమ ఇంటి వద్ద దీపం వెలిగించాలని కోరారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మోదీ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రతి కుటుంబాన్ని కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఒకే సమయంలో ప్రతి ఇంటా దీపాలు వెలిగించి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని విష్ణువర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
