ఏఆర్‌టీ… సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫాం
ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్..
ఆంధ్రప్రభ, హైదరాబాద్, ఆగస్టు 27, 2025: దేశంలోనే ప్రీమియర్ ఐవీఎఫ్, ఫెర్టిలిటీ చికిత్సా కేంద్రంగా పేరొందిన ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా సంస్థ.. తన అత్యాధునిక వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా అందరూ సందర్శించగలిగే ఫిజిటల్ అనుభవాలతో కూడిన సృజనాత్మక సూట్‌ను ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగతంగా, డిజిటల్ అనుభవాలను కలగలిపి ఇక్కడకు రావాలనుకున్న పేషెంట్లకు ముందుగానే అన్నీ ఎలా ఉంటాయో చూపించేందుకు ఈ సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫాంను రూపొందించారు. తద్వారా దేశంలో ఫెర్టిలిటీ చికిత్సలు మారుతున్న తీరును అందిస్తున్నారు.
ఇందులోభాగంగా ఎంపిక చేసిన దంపతులకు ప్రతి శనివారం వారి అత్యాధునిక ల్యాబ్ సందర్శన ఉచితంగా ఉంటుంది. ఇందులో అత్యాదునిక టెక్నాలజీ, అద్భుతమైన ప్రొసీజర్లు, వారి భావి పిండాలను కాపాడే విధానాలు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ ఎడ్యుకేషనల్ టూర్ల ద్వారా ఎంబ్రియో ట్రాకింగ్, గుర్తింపు కోసం క్లినిక్‌లో ఉన్న ఆర్ఐ విట్నెస్ టెక్నాలజీ తెలుస్తుంది. దీంతో ఐవీఎఫ్ విధానంపై నమ్మకం కలుగుతుంది. ముందెన్నడూ లేనంత భద్రత, పరిశుభ్రమైన హ్యాండిలింగ్, ప్రతి అడుగులోనూ కచ్చితత్వంతో అండాల సేకరణ నుంచి వాటి బదిలీ, పిండాన్ని కాపాడడం వరకు అన్నీ పూర్తి భద్రతతో చేస్తారు. సాంకేతికతతో కూడిన ఈ కచ్చితత్వం, విస్తృతమైన వైద్య నైపుణ్యం, రోగుల సమగ్ర సంరక్షణ.. వీటన్నింటివల్ల ఫలితాలు అద్భుతంగా వస్తాయి. దేశంలోనే అత్యధిక లైవ్ బర్త్ రేట్లను ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ నిరంతరం అందిస్తోంది.
పేషెంట్ ఎక్స్ పీరియన్స్ ఆవిష్కరణ సందర్భంగా ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా ప్రాంతీయ అధిపతి గురుసిమ్రన్ కౌర్ మాట్లాడుతూ, “ప్రారంభ సమయం నుంచి ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా రోగులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఫెర్టిలిటీ చికిత్సలను ప్రజాస్వామ్యబద్ధం చేయాలన్న మా విధానానికి ఇది నిదర్శనం. ఇప్పుడు మా కొత్త వెబ్‌సైట్ ఆవిష్కరణ మా విజన్‌ను పూర్తిచేసుకోవడంలో మరో ముందడుగు. తల్లిదండ్రులు కావడం అనేది దంపతుల కల. దాన్ని మరింత సులభంగా, అందుబాటులో ఉండేలా మేం చేస్తాం. మేం కేవలం వైద్యపరమైన, సంరక్షణ సేవలే కాదు.. పూర్తిస్థాయి మద్దతు, అవగాహన, అత్యాధునిక సాంకేతికతలను ఈ చికిత్సలో భాగంగా అందిస్తాం. విజ్ఞానం అందడంలో అంతరాలను అంతం చేసి, రోగులందరిలో నమ్మకం కలిగించి, వారికి ఈ ప్రయాణంలోని ప్రతి అడుగులోనూ ప్రోత్సాహం అందించి, వాళ్లకు అవసరమైన, పొందాల్సిన ఫెర్టిలిటీ చికిత్సలు అందిస్తాం” అని తెలిపారు.


