నో హెల్మెట్ … నో పెట్రోల్…

నో హెల్మెట్ … నో పెట్రోల్…
టేకుమట్ల, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాలు తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు టేకుమట్ల ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం ఆరైవ్ అలైవ్ భాగంగా నో హెల్మెట్ – నో పెట్రోల్ కార్యక్రమాన్ని చేపట్టారు టేకుమట్ల మండలంలోని హెచ్పి, భారత్ పెట్రోల్ బంకుల వద్ద నో హెల్మెట్- నో పెట్రోల్ కార్యక్రమం నిర్వహించి వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. హెల్మెట్ లేకుండా వచ్చే వారికి పెట్రోల్ పోయవద్దని బంక్ సిబ్బందికి సూచించారు. పెట్రోల్ కోసం సిబ్బందిపై ఒత్తిడి తెచ్చే వాహనదారులపైనే కాకుండా హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోసిన సిబ్బందిపై కూడా సీసీ కెమెరాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని వాటిని అరికట్టేందుకే ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తునట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పెట్రోల్ బంక్ సిబ్బంది వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.
