గోదావరిఖనిలో ఘనంగా కర్ర పూజ

  • అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు
  • ఉత్సవాల కోసం వేదికల ముస్తాబు

గోదావరిఖని, ఆంధ్రప్రభ : దసరా పండుగ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో భద్రకాళి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఘనంగా కర్ర (దండు)పూజ నిర్వహించారు. నగరంలోని ప్రధాన చౌరస్తా హనుమాన్ నగర్ వేదికగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు.

దుర్గామాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనకు ముందు ఆనవాయితీగా నిర్వహించే కర్ర పూజలను శనివారం వైభవంగా చేపట్టారు. కర్ర దండుకు పసుపు కుంకుమలు పూసి… పూలదండలు మామిడి తోరణాలు ఏర్పాటుచేసి… నూతన వస్త్రములు నవధాన్యాలను పోసి ప్రత్యేక పూజ కార్యక్రమల మధ్య విగ్రహ ప్రతిష్టాపన వేదిక వద్ద ఏర్పాటు చేశారు.

దేవి నవరాత్రుల సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన కోసం నగరంలో వేదికలను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. నగరంలోని వాడవాడలో అమ్మ వారి దగ్గర ప్రతిష్టాపనల కోసం వేదికలను ఆకర్షణీయంగా చేపట్టే కార్యక్రమంలో భవాని మాత భక్తులు నిమగ్నమయ్యారు.

పసుపు కుంకుమల తో… మామిడి తోరణాల మధ్య… జై భవాని నినాదాలతో హోరెత్తిపోయింది. ఈ కార్యక్రమంలో భద్రకాళి యూత్ అసోసియేషన్ ప్రతినిధులు మామిడి కుమార్, ధారా రాకేష్ చింటూ, బైరం వేణు, వెంకటేష్, రాము, యోగి, కుమార్, కొండ్ర శివ వర్ధన్ తోపాటు అధిక సంఖ్యలో కాలనీవాసులు, భవాని మాత భక్తులు పాల్గొన్నారు.