అధికారులు హద్దు మీరుతున్నారా ?

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. మంత్రులపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకురాలు సంచలన ఆరోపణలు చేశారు. మహిళా కమిషన్ కార్యాలయం బయట ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధితో పద్మా దేవందర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా, పత్రికల్లో వచ్చిన వార్తలపై బీఆర్ఎస్ నాయకురాలు పద్మా దేవందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘మహిళా అధికారులకు మర్యాద ఏది? వారిని చులకనగా చూస్తున్నారా?’ అంటూ మండిపడ్డారు.

మంత్రుల ఇళ్లల్లో ప్రభుత్వ సమీక్షల పేరిట మహిళా అధికారులను టార్గెట్ చేశారా? ఆ సమీక్షలు అర్ధరాత్రి వేళ ఎందుకు జరుగుతున్నాయి అని ప్ర‌శ్నించారు. ప్రతిపక్షం కావాలనే బురద జల్లుతోంద‌ని.. అలా జ‌ర‌గ‌లేద‌ని మంత్రులు చెబుతున్నది నిజమా? లేదా పత్రికల్లో వచ్చిన ఆరోపణలు నిజమా? అని ప్ర‌శ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంచలన విషయంపై పద్మా దేవందర్ రెడ్డి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాలు, పద్మా దేవందర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆమె డిమాండ్ ఏమిటో తెలుసుకోవడానికి ఆంధ్ర‌ప్ర‌భ యూట్యూబ్ వీడియోను పూర్తిగా చూడండి!

Leave a Reply