Aquatic Fish | మత్య్స సందేశం..

Aquatic Fish | మత్య్స సందేశం..

Aquatic Fish | ఆంధ్రప్రభ : శ్రీమహావిష్ణువు దశావతారాల్లో మస్త్యావతారం ఒకటి. మనకు అనేక విషయాల్లో గొప్ప సందేశాలనిస్తుంది. పరిశీలనా శక్తి, అర్థం చేసుకొనే వివేకం ఉండాలే గానీ సృష్టిలోని ప్రతి పదార్థమూ(Every substance) మనకు జీవిత పాఠాలను నేర్పుతుందనడంలో సందేహం లేదు. జలచరమైన ‘చేప’ మన కెన్నో విలువైన విషయాలను బోధిస్తుంది. జన్మభూమి కోసం ప్రాణాలనైనా అర్పించాలన్నది చేపల నుండి నేర్చుకోవలసిన మొదటి పాఠం(The first lesson). తాను పుట్టి పెరిగిన నీటినుండి బలవంతంగా బయటకు తేబడితే వెంటనే తమ ప్రాణాలను వదిలేస్తాయవి. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అంటూ మనలాగా మాటలతో కాకుండా చేతలతో నిరూపించే గొప్ప ప్రాణి చేప.

Aquatic Fish
Aquatic Fish

‘అతి నిద్ర’ పనికి రాదని బోధి స్తుంది చేప. అది నిద్రిస్తున్నా దాని కళ్ళు తెరచి ఉంటాయి. చేపలకు కనురెప్పలు(Eyelashes) ఉండవు కనుక వాటి కళ్ళు సర్వకాల సర్వావస్థల లోనూ తెరచి ఉన్నట్లే ఉంటాయంటారు శాస్త్రవేత్తలు. గాఢనిద్రలో ఉన్నా చేపలు ఈత కొడుతూనే ఉం టాయి. అప్రమత్తతకు చేప(Fish for vigilance)ను ఉదాహరణగా చెప్పవచ్చు. నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి చేపలను తీసుకు వెళ్ళి పరిశోధనలు చేశారు. గురుత్వాకర్షణ శక్తిలేని ఆ ప్రదేశంలో కూడా చేపలు ఈదుతూనే ఉండడాన్ని, వెలుగు పడే దిశగా ఈదడాన్ని వారు రికార్డు(record) చేశారు.

అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉండే చేప మితమైన నిద్రకు, అప్రమత్తతకు సంకేతమని చెప్పవచ్చు. ప్రణాళికాబద్ధంగా(Planned) వ్యవహరించడం, ఎప్పుడూ చురుకుగా ఉండడం, సమస్యలను ఎప్పటిక ప్పుడు పరిష్కరిం చుకోవడం, స్వయం సమృద్ధిని సాధించడం, వాతావర ణానికి అనుగుణంగా జీవించడం, ఆహార సంపాదన(Food Earnings)కు మార్గాలను కనుగొనడం, శత్రువుల నుండి కాపాడు కోవడం మొదలైన వ్యక్తిత్వ వికాస పాఠాలను చేపల జీవన విధానాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనం నేర్చుకోవచ్చు.

-డా. గొల్లాపిన్ని సీతారామశాస్త్రి

CLICK HERE TO READ భగవన్నామ స్మరణ మోక్షసాధనం

CLICK HERE TO READ MORE

Leave a Reply