ప్రక్రియను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్
ప్రక్రియను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్
( నందివాడ, ఆంధ్రప్రభ )
ఆక్వా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలనికృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ( Krishna collector DK BALAJI)అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన నందివాడ (Nandiwada) మండలం, నందివాడ గ్రామంలోని ఆక్వా చెరువులను (Aqua Tanks) క్షేత్రస్థాయిలో సందర్శించి ఆక్వా రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్వయంగా (
Examined) పరిశీలించారు. ఆన్ లైస్ ఒక్కొక్క దరఖాస్తు చేయడానికి ఎంత సమయం పడుతుందన్న అంశాన్ని అధికారులు ఆచరణాత్మకంగా చేసి చూపించారు. సంబంధిత సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం నుంచి విద్యుత్ రాయితీలు, ఇతర పథకాలు వంటి ప్రయోజనాలను పొందాలంటే రిజిస్ట్రేషన్ (registration) తప్పనిసరి compalsary) అని, ఎక్కువమంది సిబ్బందిని వినియోగించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ క్రమంలో ఆయన ఆక్వా సాగు రైతు సుబ్బరాజుతో (Framer Subba Raju) ముఖాముఖి మాట్లాడి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

