సార్లేరీ ?

  • ఉపాధ్యాయుడ్ని నియమించండి సారూ…
  • గొల్లపల్లి పాఠశాలలకు జరగని ఉపాధ్యాయుడి నియామకం
  • విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి జరగని బోధన
  • విద్యకు బాలలు దూరమవుతున్నారని తల్లిదండ్రుల ఆందోళన.
  • విద్యాశాఖ కార్యాలయాల ముట్టడికి సన్నాహం


జీ.కే వీధి, ఆగస్టు 22 (ఆంధ్రప్రభ ) : ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి అక్కడి పాఠశాలకు ఉపాధ్యాయుడు (Teacher) నియామకం జరగలేదు. బోధన జరగక ఆదివాసీ చిన్నారులు విద్యకు దూరమవుతున్నారు. మండలంలోని ఏ.దారకొండ పంచాయతీ గొల్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై సుమారు మూడు నెలలు కావస్తున్నా.. నేటికీ ఉపాధ్యాయున్ని నియమించకుండా చోద్యం చూస్తున్న గూడెం కొత్త వీధి (Gudem New Street) మండల విద్యాశాఖ అధికారులని గొల్లపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అధికారులపై మీ పిల్లలే చదువుకోవాలా మా పిల్లలు ఇలా నెలల తరబడి ఉపాధ్యాయులు లేని పాఠశాలకి వచ్చే ఆడుకోవాలా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

తరగతులు బోధించేందుకు ఉపాధ్యాయుడిని నియమించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న మండల విద్యాశాఖ కార్యాలయం (Mandal Education Department Office) పై గ్రామస్తులు పిల్లలతో కలిసి ముట్టడి చేస్తామని గ్రామస్తులు తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి పై తక్షణమే అల్లూరి జిల్లా కలెక్టర్ (Collector) స్పందించి పాఠశాలలో ఉపాధ్యాయుని నియమించకుండా కాలక్షేపం చేసిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు లాసరి మల్లేశ్వరావు, వండలం నాగేశ్వరావు, చిలకల నాగేశ్వరావు, మూర్ల శ్రీను, బోనంగి చంటి గొల్లపల్లి విద్యార్థుల తల్లిదండ్రులు (students Parents) గ్రామస్తులు తెలిపారు.

అల్లూరి జిల్లా, A. ధారకొండ పంచాయితీ, G.K వీధి మండలం పెబ్బంపల్లి గ్రామత‌లో జిపిఎస్ టి డబ్ల్యూ స్కూల్ జూన్ 12వ తారీకు నుండి ఇప్పటివరకు టీచర్ (Teacher) ను నియమించలేదు. ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు 20మంది పిల్లలున్నప్పటికీ కూటమి ప్రభుత్వం టీచర్ ను నియమించలేదు. మా పిల్లలు భవిష్యత్తు కూటమి ప్రభుత్వం ఆలోచించాలని ఏ దారకొండ సర్పంచు వార్డ్ మెంబర్లు స్కూల్ చైర్మన్ పిల్లల తల్లిదండ్రులు కొరడమైనది. కూటమి ప్రభుత్వం వెంటనే టీచర్ ను నియమించాలని కోరుకుంటున్నాము.

Leave a Reply