Naspur : ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలి
naspur నస్పూర్, ఆంధ్రప్రభ : దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాలు – 2025 కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు మంచిర్యాల జిల్లా(Manchryala District) సంక్షేమ అధికారి రావుఫ్ ఖాన్ తెలిపారు. వచ్చే నెల (డిసెంబర్) 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేయనున్నారన్నారు.
సంస్థాగత కేటగిరీ(Organizational Category) కింద సేవలందిస్తున్న అర్హులైన వ్యక్తులు, సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కేటగిరీల వారిగా దరఖాస్తు ఫారం, మార్గదర్శకాల కోసం సంబంధిత వెబ్ సైట్ లో చూడాలన్నారు. హార్డ్ కాపీ దరఖాస్తులను ఈ నెల 20 (నవంబర్ 20వ తేదీ) లోగా పంపించాలని సూచించారు.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
డైరెక్టర్ (Director)
దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ సాధికారిత శాఖ, (Department of Empowerment of Disabled, Elderly and Transgender,)
గ్రౌండ్ ఫ్లోర్, దివ్యాంగుల సంక్షేమ భవన్ (Ground Floor, Divyangula Sankshema Bhavan)
నల్లగొండ ఎక్స్ రోడ్, మలక్ పేట్, హైదరాబాద్ – 500036 (Nalgonda X Road, Malakpet, Hyderabad – 500036)

