స్టెనో-టైపిస్ట్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న స్టెనో-టైపిస్ట్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ తెలిపారు. డిగ్రీతో పాటు స్టెనోగ్రఫీలో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 18 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో సూచించారు. ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం జిల్లా ఈ-కోర్ట్స్ భూపాలపల్లి వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కోరారు.