వరంగల్, మే 4 ,ఆంధ్రప్రభ : తెలంగాణ గ్రామీణ దేవాలయాలకు అందించబడుతున్న ధూప దీప నైవేద్య పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పథకం కింద అర్హత కలిగిన ఆలయాలకు నెలకు రూ.4వేలు నైవేద్యం కోసం, రూ.6వేలు అర్చకునికి గౌరవ భృతి ఇవ్వనున్నట్లు మంత్రి కొండా సురేఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. endowments.ts.nic.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 24వ తరీకు లోపు జిల్లా సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ కార్యాలయానికి సమర్పించాలన్నారు.
TG | ధూప దీప నైవేద్య పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మంత్రి కొండా సురేఖ
