సమస్యలు పరిష్కరించాలని మహాత్ముడికి వినతి
శావల్యాపురం, ఆంధ్రప్రభ: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన నిరసన కార్యక్రమం 38వ రోజుకు చేరింది. మండల కేంద్రమైన శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో శుక్రవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై రూపొందించిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.సతీష్, జిల్లా జేఏసీ కో కన్వీనర్ వై.లక్ష్మీనారాయణ, స్టాఫ్ నర్స్ ప్రమీల పాల్గొన్నారు.
