Monday, January 20, 2025

Zurich Meet – వర్క్‌ ఫ్రం హోమ్‌ హబ్‌గా ఎపి – మీ భాగస్వామ్యం ఆశిస్తున్నా: చంద్రబాబు

ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోమ్‌ కల్చర్‌ వేగంగా పెరుగుతోంది. ఏపీని వర్క్‌ ఫ్రం హోమ్‌ హబ్‌గా చేయాలనేది నా లక్ష్యం. ఇందుకు యూరప్‌లోని 12 దేశాల నుంచి తెలుగు వ్యాపారవేత్తలభాగస్వామ్యం ఆశిస్తున్నా, లాన్ పవర్‌ను ఫిజికల్‌ లేదా వర్చువల్‌గా నియమించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏఐ, చాట్‌ జీపీటీ నైపుణ్యం పెంచుకోవాలి అని ఎపి సీఎం చంద్రబాబు అన్నారు.

నవ్యాంధ్రంకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం సారథ్యంలో ఏపీ ప్రత్యేక బృందం దావోస్‌లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీతో చంద్రబాబు ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ నిర్వహించారు. ఈ మీట్లో వందలాది మంది తెలుగు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు ఈ సమావేశానికి యూరప్‌లోని 12 దేశాల నుంచి తెలుగు వ్యాపారవేత్తలు రావడం గమనార్హం. దీనిపై సీఎం బాబు మాట్లాడుతూ,.యూరప్‌లోని 12 దేశాల నుంచి వ్యాపారవేత్తలు ఈ సమావేశానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

తనకు మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టి చనిపోవాలని ఉందని చంద్రబాబు అన్నారూ. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ తెలుగువారుంటారని, అవకాశం ఉన్న ప్రతిచోటుకీ మనవాళ్లు వెళ్లిపోతారని చెప్పారు. అన్ని దేశాల్లో తెలుగువాళ్ల ఫుట్‌ ప్రింట్‌ ఉంటుంది. అదే మన గొప్పతనం. తెలుగువాళ్లు ఎక్కడైనా గొప్పగా పని చేస్తారు. రాణిస్తారు.

- Advertisement -

పట్టుదల ఎక్కువ. నైపుణ్యాలు పెంచుకుంటారు. నేను జైల్లో చేసిన న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచారు. అప్పుడు ఇన్ని దేశాల్లో తెలుగువాళ్లు ఉన్నారా? అని ఆశ్చర్యపోయా. మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు.

‘ఆ రోజుల్లో ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా. యువత గ్రామాల నుంచి నగరాలకు వచ్చి ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించి, ఐటీ రంగంలోకి వచ్చారు. హైదరాబాద్‌లో భూములు అమ్ముకోవద్దని అనేకమందికి చెప్పా. ఇక్కడి భూములకు మంచి ధర వస్తుందని ఆనాడే చెప్పా. తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయానికి హైదరాబాద్‌ సంపదే కారణం. చదువులో ఆడపిల్లలపై వివక్ష చూపించొద్దని ఆనాడే చెప్పాను.

ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి వెళ్లినా అమ్మాయిలు కనిపిస్తున్నారు. ప్రస్తుతం యువకుల కంటే యువతులకే ఎక్కువ ఆదాయం వస్తోంది. వాస్తవానికి పురుషుల కంటే మహిళలే తెలివైన వాళ్లు. పరిశోధనలు కూడా అదే చెబుతున్నాయి.సంపద సృష్టించడం కష్టం కాదు.

2047 నాటికి తెలుగువాళ్లు గొప్పగా ఉండాలనేదే నా లక్ష్యం. తెలుగు వాళ్లకు ప్రత్యేక గుర్తింపు రావాలి. తెలుగువాళ్లు అనేక కష్టాలుపడి ఈ స్థాయికి వచ్చారు. ఉక్రెయిన్‌లో సమస్య వచ్చినప్పుడు ప్రవాసాంధ్రులు బాగా పని చేశారు. ఎక్కడికి వెళ్లినా మీరు మూలాలు మరిచిపోకూడదు. ఆ రోజు ఇంజినీరింగ్‌ కాలేజీలు తేవడం వల్లే మీరంతా చదువుకున్నారు. ఎంతో పోరాడి మైక్రోసాఫ్ట్‌ కంపెనీని హైదరాబాద్‌లో పెట్టించా. మన రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రవాసాంధ్రులను ఎలా ప్రోత్సహించాలన్న దిశగా ఆలోచన చేస్తున్నాం. నిరంతర శ్రమ వల్లే తెలుగువాళ్లు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. యువత ఎప్పుడూ భవిష్యత్‌ దిశగా ఆలోచించాలి.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement